భట్టి వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్‌ కౌంటర్‌

భట్టి వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్‌ కౌంటర్‌

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌పై వాడీవేడీ చర్చ జరిగింది. సీఎం కేసీఆర్‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్ ఉండగా.. ఇప్పుడు ఆరేళ్లకే దివాలా తీసిన ప్రభుత్వంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని ఆరోపించారు భట్టి.

భట్టి వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు సభను తప్పుదోవ పట్టించడం మంచిది కాదని హితవు పలికారు. చాలా మంది ఆర్థిక నిపుణులను సంప్రదించి బడ్జెట్‌ను రూపొందించామన్న కేసీఆర్‌.. వాస్తవిక దృక్పథంతోనే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టామని తెలిపారు.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story