చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. డీకే శివకుమార్ తమ్ముడు ఎంపీ సురేష్

కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్ ఈడీ కస్టడీని ఈ నెల 17 వరకూ పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు తీర్పిచ్చింది. అక్రమ ఆస్తుల సేకరణ, ఢిల్లీ నివాసం నుంచి లెక్క తేలని నిధుల స్వాధీనం కేసుకు సంబంధించి శివకుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రెండు వారాల కింద విచారణకు ఢిల్లీ రప్పించి, అదుపులోకి తీసుకుంది. తొమ్మిది రోజులుగా వంద గంటలకు పైగా ఆయనను ఈడీ అధికారులు విచారించారు. 20 దేశాల్లో 386 అకౌంట్లతో పెద్దఎత్తున నిధులు అక్రమంగా దాచారని కోర్టు దృష్టికి ఈడీ అధికారులు తీసుకెళ్లారు. మరో నాలుగు రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరగా, 17 వరకూ కస్టడీని పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు తన సోదరుడిని వేధించేందుకే ఈడీ అధికారులు తప్పుడు కేసులు పెట్టి, అక్రమంగా అరెస్టు చేశారని ఎంపీ డీకే సురేష్ ఆరోపించారు. శివకుమార్ ఎలాంటి పన్ను ఎగవేతలకు పాల్పడలేదని చెప్పారు. ఈడీ అధికారులు తగిన ఆధారాలు చూపకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీకే సురేష్ స్పష్టం చేశారు.
Also watch :
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com