బంపర్ ఆఫర్.. హెల్మెట్ ధరిస్తే నో చెకింగ్..

బంపర్ ఆఫర్.. హెల్మెట్ ధరిస్తే నో చెకింగ్..
X

ద్విచక్ర వాహనదారులకు పోలీసు ఉన్నతాధికారులు బంపర్ ఆఫర్ ఇచ్చారు. హెల్మెట్ ధరించి బైక్ నడిపితే ఇతర పత్రాల కోసం వారిని తనిఖి చేయవద్దని ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. హెల్మెట్ ఖచ్చితంగా వాడాలన్న ఉద్దేశ్యం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అయన తెలిపారు. బైక్ యాక్సిడెంట్ లో మేజర్ మరణాలు హెడ్ ఇంజ్యూరీ వలెనే జరుగుతున్నాయని.. అడ్డుగా భావించి కొందరు హెల్మెంట్ ధరించడంలేదు.. దాంతో యాక్సిడెంట్ కు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారన్నారు. హెల్మెట్ ధరించాలని వాహనదారులను ప్రోత్సాహిస్తున్నామన్నారు. దీంతో హెల్మెట్ వాడకం పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వాహనదారులను తదుపరి ఆదేశాల వరకు తనిఖీల నుంచి కొంతకాలం మినహాయింపు ఇవ్వాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించారు. అయితే హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే మాత్రం వారిని చెకింగ్ చేయాలనీ ఆదేశించారు.

Tags

Next Story