చిదంబరానికి మరో ఎదురుదెబ్బ.. భోజనం కూడా..

చిదంబరానికి మరో ఎదురుదెబ్బ.. భోజనం కూడా..
X

కేంద్రమాజీ మంత్రి చిదంబరానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ ముందు లొంగిపోతానంటూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. మనీలాండరింగ్ కేసులో ఈడీ ఎదుట సరెండర్ కావడానికి అవకాశం ఇవ్వాలంటూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. చిదంబరాన్ని ఇప్పుడే అరెస్టు చేయబోమని, అందుకు ఇంకా సమయం ఉందని ఈడీ పేర్కొంది. తగిన సమయంలో చిద్దూను అదుపులోకి తీసుకుంటామని తెలిపింది. దీంతో చిదంబరం పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

మరోవైపు భోజనం విషయంలోనూ చిదంబరానికి చుక్కెదురైంది. ఇంటి నుంచి భోజనం తెప్పించుకో వడానికి చిదంబరానికి అనుమతి లభించలేదు. చిదంబరం జైలు భోజనం చేయలేరని, ఇంటి నుంచి ఫుడ్ తెప్పించుకోవడానికి అనుమతించాలని ఆయన లాయర్ కపిల్ సిబల్ కోర్టును కోరారు. ఈ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. జైలులో ఒక్కొక్కరికి ఒక్కో విధమైన భోజనం ఉండదని, అందరికీ ఒకే రకమైన ఆహారం ఉంటుందని కోర్టు పేర్కొంది.

Also watch :

Tags

Next Story