మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ఇంట విషాదం

మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ఇంట విషాదం

మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి, మాజీ ఐఏఎస్‌ అధికారి బీఎన్‌ యుగంధర్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శుక్రవారం మృతి చెందారు. 1962 బ్యాచ్‌కు చెందిన యుగంధర్‌.. సుధీర్ఘ కాలం సేవలు అందించారు. పీవీ నర్సింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పీఎంవో కార్యదర్శిగా, ప్రణాళిక సంఘం సభ్యుడిగా పలు కీలక హోదాల్లో పని చేశారు. అలాగే గ్రామీణాభివృద్ధి శాఖలో కీలక సంస్కరణలు తీసుకొచ్చారు. బీఎన్‌ యుగంధర్‌ స్వస్థలం అనంతపురం జిల్లా యల్లనూరు మండలం బుక్కాపురం. హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఇక సత్య నాదెళ్ల తల్లి ప్రభావతి 2015లో మరణించారు. బీఎన్‌ యుగంధర్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్‌, టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.

Tags

Read MoreRead Less
Next Story