తల మీద కొమ్ము.. తలపట్టుకున్న శ్యామ్

తల మీద కొమ్ము.. తలపట్టుకున్న శ్యామ్
X

ఏం.. కొమ్ములొచ్చాయా.. చెప్పిన మాట వినట్లేదు.. అందో ఏమో వాళ్ల అమ్మ చిన్నప్పుడు.. పాపం నిజంగానే తల మీద కొమ్ములు కాదు కానీ.. కొమ్ము వచ్చి ఇబ్బంది పడుతున్నాడు మధ్యప్రదేశ్ రాహి గ్రామానికి చెందిన శ్యామ్‌లాల్. కొన్నాళ్ల క్రితం తలకు దెబ్బతగిలిందని ఆసుపత్రికి వెళ్లాడు శ్యామ్‌లాల్. వైద్యులు చికిత్స అందించడంతో నొప్పి తగ్గింది కానీ విచిత్రంగా కొమ్ములాంటి ఆకారం ఒకటి తలపై పెరుగుతూ వచ్చింది. మళ్లీ ఆసుపత్రికి ఏం వెళతాంలే అని తానే పెరిగిన దాన్ని పెరిగినట్టు కత్తిరిస్తూ వస్తున్నాడు. కత్తిరిస్తున్నప్పుడు నొప్పి కూడా అనిపించకపోవడం అతడికే ఆశ్చర్యంగా అనిపించింది.

అయితే ఎంత కట్ చేస్తున్నా కొమ్ము పెరగడం మాత్రం ఆగట్లేదు. దీంతో వైద్యుని దగ్గరకు వెళ్లక తప్పని పరిస్థితి. కుటుంబసభ్యుల ఒత్తిడి మేరకు డాక్టర్‌కి చూపించాడు. వారు దాన్ని పరిశీలించి.. పరిశోధించి శ్యామ్‌లాల్ ఇంతకాలం నుంచి సబాకస్ హార్న్ (డెవిల్ హార్న్) వ్యాధితో బాధపడినట్లు తెలిపారు. సూర్యరశ్మి పడే కొన్ని శరీర భాగాల్లో చర్మం ఇలా పొడుచుకు వస్తుందని తేల్చారు. ఈ కొమ్ము మరీ లోతుగా ఏమీ లేకపోవడంతో డాక్టర్లు దాన్ని సులభంగానే తొలగించామని చెప్పారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.

Also watch :

Tags

Next Story