ఫేస్‌బుక్‌లో ప్రేమా దోమా అన్నావు.. రా మరి..

ఫేస్‌బుక్‌లో ప్రేమా దోమా అన్నావు.. రా మరి..

ఫేస్‌బుక్‌లో పరిచయం ఎంత బావుంది. చాటింగ్‌తో మొదలై.. ఛాయ్ తాగే వరకు వెళ్లింది. మరో అడుగు ముందుకు వేద్దామంటే అభిమానం అడ్డొచ్చింది. పెద్దలు చీవాట్లు పెడతారేమోనని భయపడ్డారు. దొంగ చాటుగా ప్రేమ వ్యవహారాన్ని నడిపించారు. ప్రియురాలు ఒంటరిగా ఉందని తెలిసి డైరక్ట్‌గా ఆమె ఇంటికే వెళ్లి.. అడ్డంగా బుక్కయ్యాడు ప్రియుడు.

బాలేశ్వర్ జిల్లా మణిపూర్ సోరోలోని గులునియా గ్రామానికి చెందిన సురేంద్ర బెహెరా కుమార్తెకు, కుబబపాట్న గ్రామానికి చెందిన బై కుంటకు ఫేస్ బుక్‌లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి చెట్ల చాటున ఊసులెన్నో చెప్పుకున్నారు. కాలేజీ పేరు చెప్పి సినిమాలకు, షికార్లకూ వెళ్లారు. ఇవన్నీ ఇరు కుటుంబాలకూ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఓ ఫైన్ మార్నింగ్.. ఇంట్లో ఎవరూ లేరు ఓ సారి వచ్చి వెళ్ల కూడదు అని ప్రియుడికి ఫోన్ చేసింది ప్రేమగా ప్రియురాలు. అంతే రెక్కలు కట్టుకుని ఆమె ముందు వాలిపోయాడు ప్రియుడు.

చుట్టు పక్కల వారు చూడనే చూశారు. సమాచారాన్ని నలుగురికీ చేరవేశారు. ఇంతలో బయటకు వెళ్లిన అమ్మాయి తల్లిదండ్రులు వచ్చారు. కూతురి ప్రేమ విషయం తెలుసుకుని.. ఎలాగూ వచ్చావు కదా అని అప్పటికప్పుడు అమ్మాయిని, అబ్బాయిని అలంకరించి వారి సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసేసారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story