ఒసామా బిన్‌లాడెన్ కుమారుడు హమ్జాబిన్ లాడెన్ హతం

ఆల్ ఖాయిదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్‌లాడెన్ కుమారుడు హమ్జాబిన్ లాడెన్ హతమయ్యాడు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. నిజానికి హమ్జాబిన్ లాడెన్ చనిపోయినట్టు అమెరికా మీడియా ఆగస్టు మొదట్లోనే తెలిపింది. అమెరికా ఆపరేషన్స్‌లో అతను గత రెండేళ్లలో ఎప్పుడో చనిపోయి ఉండొచ్చని కథనాలు ప్రసారం చేసింది. గత నెలలో అమెరికా రక్షణ కార్యదర్శి మార్క్ ఎస్పెర్ కూడా హమ్జా బిన్ లాడెన్ మృతిని ధ్రువీకరించారు. ‘‘చనిపోయాడని అనిపిస్తోంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే అధ్యక్షుడు ట్రంప్, ఇతర సీనియర్ అధికారులు మాత్రం ఇప్పటి వరకు నోరు విప్పలేదు. కానీ ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దులో నిర్వహించిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో హమ్జా హతమైనట్టు వైట్‌హౌస్ ప్రకటించింది. అయితే, అతడు ఎప్పుడు హతమయ్యాడన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
Also watch :
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com