బోటు ప్రమాదంలో తెలంగాణకు చెందినవారే ఎక్కువ.. సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి..

X
By - TV5 Telugu |15 Sept 2019 7:57 PM IST
కచ్చులూరు బోటు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల్లో తెలంగాణ వాసులు కూడా ఉండటంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందినవారే ఎక్కువ మంది ఉన్నారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన వారు 22 మంది కాగా, వరంగల్‌కు చెందిన వారు 14 మంది. ఈ ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం... ఐదు లక్షల ఆర్ధిక సాయం ప్రకటించింది. వీరి కుటుంబాలకు అండగా ఉంటామన్నారు సీఎం కేసీఆర్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com