ఘోర రోడ్డు ప్రమాదం .. భార్యాభర్తలు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం .. భార్యాభర్తలు మృతి

యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాదగిరిగుట్ట మండలం రామాజీపేట సమీపంలో కారు బైక్‌ను ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలు మృతి చెందారు. కూతురి పరిస్థితి విషమంగా ఉంది. వరంగల్‌-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మృతులు ఆలేరుకు చెందిన విజయ, రాములుగా గుర్తించారు. వేగంగా వెళ్తున్న కారు..మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో బైక్‌ను ఢీకొట్టింది. దీంతో స్పాట్‌లోనే భార్య విజయ మృతి చెందింది. తీవ్రగాయాలైన రాములు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. రోడ్డు ప్రమాదం భార్యాభర్తలను చిదిమేయడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ ప్రమాదం ఆ చిన్నారికి తల్లిదండ్రులను దూరం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story