ఆ చిన్న పొరపాటే ఇంత పెద్ద ప్రమాదానికి కారణమైంది

ఆ చిన్న పొరపాటే ఇంత  పెద్ద  ప్రమాదానికి కారణమైంది

ఓ యాత్ర వారి కుటుంబాలలో విషాదం నింపింది. ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకున్న వారి ఆశ అడియాస అయింది. మృత్యువు వెంటాడింది చివరకు గోదావరమ్మ ఒడిలో జల సమాధి అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపాన కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు నీట మునిగి 12 మంది మృత్యువాత పడ్డారు. 27 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరగా, 32 మంది గల్లంతయ్యారు. ప్రమాదం జరినప్పుడు లాంచీలో మొత్తం 73 మంది ఉన్నట్లు తెలుస్తోంది. మరో 25 మంది ఆచూకి కోసం గాలిస్తున్నారు.

ఆదివారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. పర్యాటకులంతా .. భోజనం చేసేందుకు ఒక్కసారిగా బోటుకు ఒకే వైపు వచ్చారు. దీంతో బోటు ఒరిగిపోయింది. బోటు పూర్తిగా మునిగిపోవడంతో.... దాదాపు 40 మంది వరకు గల్లంతయ్యారు. కేవలం లైఫ్‌జాకెట్‌ వేసుకున్నవారే ప్రాణాలతో బయటపడ్డారు . ఈ దుర్ఘటనలో తెలంగాణకు చెందినవారే ఎక్కువ. హైదరాబాద్‌కు చెందినవారు 22 మంది కాగా, వరంగల్‌ వాళ్లు 14 మంది ఉన్నారు. వీరితో పాటు అనకాపల్లి, విజయవాడ, విశాఖకు చెందిన వారు కూడా ఉన్నారు.

బాధితులకు తక్షణ సహాయం చేయాలంటూ సీఎం జగన్మోహన్‌రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం ప్రకటించారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం.. బాధితులకు అండగా నిలిచారు. పవన్‌ కల్యాణ్‌ సైతం ఈ దుర్ఙటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బోటు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ కూడా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. వారికి ఐదు లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం ప్రకటించారు. ప్రస్తుతం NDRF, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. .

Tags

Read MoreRead Less
Next Story