టెన్త్, ఇంటర్ అర్హతతో DRDOలో ఉద్యోగాలు..

డిఫెన్స్ రిసెర్చ్&డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టమ్) వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పదవతరగతి, ఇంటర్ అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వివరాలు.. ఖాళీల సంఖ్య: 224.. స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-2): 13, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 'A': 58, స్టోర్ అసిస్టెంట్ 'A' : 32, సెక్యూరిటీ అసిస్టెంట్ 'A': 40, క్లర్క్ (క్యాంటీన్ మేనేజర్ గ్రేడ్-3): 03, అసిస్టెంట్ హల్వాయ్ కమ్ కుక్ 'A' : 29, వెహికల్ ఆపరేటర్'A' : 23, ఫైర్ ఇంజన్ డ్రైవర్'A': 06, ఫైర్‌మ్యాన్: 20.. విద్యార్హత.. స్టెనో గ్రాఫర్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, స్టోర్ అసిస్టెంట్ క్లర్క్, కుక్‌లకు ఇంటర్ అర్హత ఉండాలి. వెహికల్ ఆపరేటర్, ఫైర్ ఇంజన్ డ్రైవర్, ఫైర్‌మ్యాన్ పోస్టులకు పది అర్హత సరిపోతుంది. వయసు: దరఖాస్తు గడువు ముగిసే నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ ద్వారా అప్లైచేసుకోవాలి. దరఖాస్తు ఫీజు: రూ.100లు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.09.2019, ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.10.2019. ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ ద్వారా. పరీక్ష తేదీలు ప్రకటించాల్సి ఉంది.
also watch
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com