కోడెల మెడపైన మార్క్ ఉంది - డీసీపీ శ్రీనివాస్

కోడెల మెడపైన మార్క్ ఉంది - డీసీపీ శ్రీనివాస్
X

ఆత్మహత్య చేసుకున్న మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు భౌతికకాయానికి.. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహిస్తామని తెలిపారు పోలీసులు. ఆ తర్వాతే మరణానికి కారణాలు చెప్పగలమని అన్నారు. అయితే ఆయన మెడపై మార్క్ ఉందని డీసీపీ శ్రీనివాస్ చెప్పారు. ప్రాథమిక విచారణ ప్రకారం ఎలాంటి అనుమానాలు లేవన్నారు. సీన్‌ ఆఫ్‌ అఫెన్స్ కూడా మొత్తం ప్రొటెక్ట్ చేశామని తెలిపారు.

ఉదయం 11 గంటల 30 నిమిషాలకు కోడెలను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకొచ్చారని పోలీసులు తెలిపారు. దాదాపు 40 నిమిషాల పాటు ఆయన్ను కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించారు. కానీ సాధ్యపడలేదు. 12 గంటల 10 నిమిషాల తర్వాత కోడెల చనిపోయాడని డాక్టర్లు నిర్దారించినట్లు.. డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. ఈ ఘటన జరిగినప్పుడు కోడెల నివాసంలో భార్య, కూతురు, పనిమనిషి మాత్రమే ఉన్నారు. కోడెల కుమారుడు ఆ ఇంట్లో ఉండటం లేదని తెలిసిందని పోలీసులు తెలిపారు.

Also watch :

Tags

Next Story