ఆ సమయంలో కూడా నో చెప్పలేకపోయా..

దోమలు బాబూ.. దోమలు.. ఎంత జాగ్రత్తగా ఉన్నా కుట్టేస్తున్నాయ్. పరిశుభ్రంగా లేని పరిసరాల్లో మరింతగా విజృంభిస్తున్నాయి. ఆసుపత్రులన్నీ డెంగ్యూ రోగులతో నిండి పోతున్నాయి. నేనూ డెంగ్యూ బారిన పడ్డానంటూ నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ వెల్లడించారు. ఈ విషయాన్నిఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. జ్వరాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. బుల్లితెరపై ప్రసారమవుతున్న రియాల్టీ షో ఢీకు జడ్జిగా వ్యవహరిస్తున్న రేణూ.. జ్వరం నుంచి కోలుకుంటున్న సమయంలో షూటింగ్ చేయాల్సి వచ్చింది. షూటింగ్‌కి నో చెప్పలేకపోయానన్నారు. దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పొడవైన దుస్తులు ధరించాలని తెలిపారు. రైతుల సమస్యలను కథాంశంగా తీసుకుని రేణూ దేశాయ్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన దర్శకత్వ బాధ్యతలను ఆమె చేపట్టారు. మంచి భావుకత నిండిన కవితలను రాస్తూ రేణూ అభిమానులకు మరింత దగ్గరయ్యారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

