కోడెలది ముమ్మాటికీ వైసీపీ ప్రభుత్వ హత్యే - లోకేశ్

కోడెల శివప్రసాద్‌రావు మృతిపట్ల.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జగన్ గారూ.. శవాల మీద రాజకీయ లబ్ధి కాసులు ఏరుకునే పైశాచిక చేష్టలను వైసీపీ ఎప్పటికీ మానుకోదా..? అని ట్వీట్ చేశారు. కోడెలను కేసుల పేరుతో వేధించి ఆయన బలవన్మరణానికి కారణమైనందుకు పశ్చాత్తాపం లేకుండా అసత్య ప్రచారాలతో రెచ్చిపోతారా అంటూ వైసీపీపై మండిపడ్డారు. మీరసలు మనుషులేనా.. మీకసలు విలువలనేవే లేవా అంటూ ట్వీట్ ద్వారా ఫైర్ అయ్యారు లోకేశ్.
కోడెలది ఆత్మహత్య కాదు.. ముమ్మాటికి వైసీపీ ప్రభుత్వ హత్యేనని ట్వీట్టర్ ద్వారా లోకేశ్ ఆరోపించారు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకే కుటుంబ కలహాలు, కొడుకు కొట్టి చంపారని అసత్య ప్రచారాలు చేస్తున్నారని.. వైసీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెల కొడుకు విదేశాల్లో ఉన్న విషయం మీకు కనపడలేదా అన్నారు లోకేశ్.
కోడెలగారిది ఆత్మహత్య కాదు. ఇది ముమ్మాటికీ వైకాపా ప్రభుత్వ హత్యే. దాన్ని కప్పిపుచ్చుకోడానికి కుటుంబ కలహాలు అని, కొడుకే కొట్టి చంపారని నిస్సిగ్గుగా మీ దొంగ ఛానల్ లో కథనాలు ప్రసారం చేస్తారా? కోడెలగారి కొడుకు విదేశాల్లో ఉన్న విషయం మీ గుడ్డి సాక్షి ఛానల్ కి కనపడలేదా? pic.twitter.com/bGL6gd78Xp
— Lokesh Nara (@naralokesh) September 16, 2019
Also watch :
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com