మళ్లీ మార్కెట్లో మోటోరోలా.. సరికొత్త ఫీచర్లు.. క్యాష్‌బ్యాక్ ఆఫర్లు..

మళ్లీ మార్కెట్లో మోటోరోలా.. సరికొత్త ఫీచర్లు.. క్యాష్‌బ్యాక్ ఆఫర్లు..

ఒకప్పుడు మొబైల్ రంగంలో సంచలనాలు సృష్టించిన మోటోరోలా మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. తాజాగా మోటో ఈ6ఎస్ పేరుతో కొత్తగా స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రూ.7,999 ధరకే 4జీబీ+64జీబీ స్మార్ట్‌ఫోన్ విడుదల చేసి సంచలనం సృష్టించింది. ఈ ఫోన్ కొన్న వారికి జియో నుంచి రూ.2,200 విలువైన క్యాష్‌బ్యాక్, రూ.3,000 ఓచర్లు కూడా లభించనున్నాయి. మోటో ఈ6ఎస్ ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్. ఆండ్రాయిడ్ వన్ సిరీస్‌ తరహా ధరలోనే ఈ మోటో ఈ6ఎస్ కూడా లభిస్తుంది. ఇక ఈ ఫోన్ సేల్స్ సెప్టెంబర్ 23న ప్లిప్‌కార్ట్‌లో ప్రారంభమవుతాయి.

ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే.. *6.1 అంగుళాల హెచ్‌డీ+డిస్‌ప్లే * 4 జీబీ ర్యామ్ *64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ *మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్ *13+2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా *8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా *3000 ఎంఏహెచ్ బ్యాటరీ * ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్ * డ్యూయెల్ సిమ్ వంటి ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షించనుంది.

Tags

Read MoreRead Less
Next Story