పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులు!

పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులు!
X

గుంటూరు జిల్లా పల్నాడులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. బీజేపీ నేతలు చేపట్టిన భరోసా యాత్రతో టెన్షన్ వాతావరణానికి తెరతీసింది. వైసీపీ కార్యకర్తల దాడిలో బాధితులుగా మారిన బీజేపీ శ్రేణులకు భరోసా ఇచ్చేందుకు కమలదళం పిలుపునిచ్చిన భరోసా యాత్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గురజాల ఆర్డీవో కార్యాలయం వద్ద బీజేపీ భరోసా సభ పెట్టారు. అయితే పల్నాడులో ఇప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయని.. ర్యాలీలు, సభలు వద్దని బీజేపీ నేతలకు పోలీసులు సూచించారు.

పోలీస్‌ ఆంక్షలు లెక్క చేయకుండా.. భరోసా సభ నిర్వహించి తీరుతామని కన్నా ప్రకటన చేశారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆర్డీవో కార్యాలయం వద్ద తలపెట్టిన సభను వాయిదా వేసుకోవాలని పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కన్నాకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆయన నిరాకరించారు. దీంతో ఇంటికి నోటీసులు అంటించారు. ఇంటి నుంచి కార్యకర్తలతో కలిసి గురజాలకు బయలుదేరిన కన్నాను పోలీసులు అడ్డుకున్నారు. గురజాలలో 144 సెక్షన్, 30 యాక్ట్ అమలు చేస్తున్నందున కన్నాను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Also watch :

Tags

Next Story