వాగు దాటుతుండగా.. ఒక్కసారిగా వరద ప్రవాహం.. టీచర్..

X
By - TV5 Telugu |17 Sept 2019 6:11 PM IST
తూర్పుగోదావరి జిల్లాలో ఓ వాగులో కొట్టుకుపోతున్న ఉపాధ్యాయురాలిని కాపాడారు స్థానికులు. మధ్యాహ్నాం విధులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్లేందుకు వాగు దాటుతుండగా.. ఒక్కసారిగా వరద ప్రవాహం పోటెత్తింది. దీంతో ఆ ఉపాధ్యాయురాలు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. ఇది గమనించిన గ్రామస్తులు.. ఆమెను చాకచక్యంగా కాపాడారు. కూనవరం మండలం బోదునూరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన స్థానికులు... ఆమెను కూనవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com