బుధవారం నరసరావుపేట బంద్

బుధవారం నరసరావుపేట బంద్
X

గుంటూరులోని టీడీపీ ఆఫీసుకు చేరుకున్న కోడెల భౌతిక కాయానికి నేతలు, కార్యకర్తలు, అభిమానులు నివాళులు అర్పించారు. తమ అభిమాన నేతకు కడసారి వీడ్కోలు పలికేందుకు... భారీగా తరలివస్తున్నారు. కోడెల పార్థీవదేహాన్ని నరసరావుపేటలోని నివాసానికి తరలిస్తున్నారు. పేరేచర్ల, మేడికొండూరు, కొర్రపాడు, సత్తెనపల్లి మీదుగా నరసరావుపేట వరకు కోడెల అంతిమయాత్ర నిర్వహిస్తున్నారు. బుధవారం నరసరావుపేటలో అధికార లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక బుధవారం నరసరావుపేటలోని అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. ప్రైవేట్ విద్యాసంస్థలకు కూడా సెలవు ప్రకటించారు.

Tags

Next Story