శ్రీదేవి, శోభన్ బాబులను గుర్తు చేసిన పూజాహెగ్డే, వరుణ్ తేజ్

శ్రీదేవి, శోభన్ బాబులను గుర్తు చేసిన పూజాహెగ్డే, వరుణ్ తేజ్

ఎల్లువొచ్చి గోదారమ్మా వెల్లాకిల్లా పడ్డాదమ్మో.. దేవత సినిమాలోని ఈ పాటను ఇష్టపడని వారెవరు..? అలాంటి ఈ ఎవర్ గ్రీన్ మెలోడీని వరుణ్ తేజ్, పూజాహెగ్డేలపై రీమిక్స్ చేశారు. వాల్మీకి సినిమా కోసం హరీష్ శంకర్ క్రియేట్ చేసిన ఈ సిట్యుయేషనల్ రీమిక్స్ సాంగ్ సింప్లీ సూపర్బ్ అనిపించుకుంటోంది. ఈ నెల 20న విడుదల కాబోతోన్న వాల్మీకి సినిమాలోని ఈ రీమిక్స్ పాటను విడుదల చేశారు.. నాటి శ్రీదేవిని మరిపించడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ తనదైన శైలిలో పూజాహెగ్డే హొయలు పోయింది.. సోగ్గాడు శోభన్ బాబును ఇమిటేట్ చేస్తూ వరుణ్ తేజ్ ఆకట్టుకున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story