టెర్రరిస్టుల బీభత్సం.. 24 మంది మృతి

X
ఆప్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆత్మాహుతి దాడులతో టెర్రరిస్టులు బీభత్సం సృష్టించారు. సెంటర్ పర్వాన్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ దాడిలో 24 మంది మృతి చెందారు. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. కాబూల్ పట్టణంలోని అమెరికా ఎంబసీకి సమీపంలో కూడా మరో పేలుడు సంభవించింది.
ఆప్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనికి అనుకూలంగా సెంటర్ పర్వాన్ ప్రావిన్స్‌లో ఎన్నికల సభ ఏర్పాటు చేశారు. ఆ సభను టార్గెట్‌గా చేసుకొని బాంబు దాడి చేశారు. కారులో పేలుడు పదార్థాలతో వచ్చిన ఉగ్రవాది.. కారుతో పాటు తనను తాను పేల్చుకున్నాడు. ఈ పేలుడు ధాటికి 24 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పదుల మంది తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Also watch :
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
