అయోధ్య కేసులో డెడ్‌లైన్ విధించిన సుప్రీంకోర్టు

ఈ ఏడాది చివరికల్లా అయోధ్య వివాదం తేలిపోతుందా..! రామజన్మభూమి కేసును 2019లోనే ఓ కొలిక్కి తేవాలని సుప్రీంకోర్టు భావిస్తోందా..? బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఆదేశాలు చూస్తే.. ఏళ్లతరబడి సాగుతున్న దానికి 3 నెలల్లో ముగింపు వచ్చేలా ఉంది. కక్షిదారులంతా విచారణ త్వరగా పూర్తయ్యేందుకు సహకరించాలని చీఫ్ జస్టిస్ కోరారు. అక్టోబర్ 18లోగా ఇరుపక్షాల వాదనలు పూర్తి చేయాలని ఆదేశించారు. అదే స్పీడ్‌లో ఈ ఏడాది చివరికి విచారణ కూడా పూర్తి చేయాలన్నారు. శనివారాలు ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని గంటల సమయం కేటాయించైనా సరే విచారణ త్వరగా జరిగేలా చూడాలన్నారు. ఈ కేసులో ఒక పార్టీ అయిన రామ్‌లల్లా విరాజ్‌మాన్ తరపున లాయర్లు 2 రోజుల్లో వాదనలు పూర్తి చేస్తామని చెప్పగా.. ముస్లిం సంఘాల తరపున అక్టోబర్ 18కల్లా వాదనలు పూర్తి కానున్నాయి. వీటిని పరిశీలించిన CJI.. దాన్నే డెడ్‌లైన్‌గా ఫిక్స్ చేశారు. ఈలోపు మధ్యవర్తుల కమిటీతో కూడా ఇరువర్గాలు మాట్లాడొచ్చని, వివాద పరిష్కారానికి మార్గాల్ని ప్రతిపాదించొచ్చని పేర్కొన్నారు.
Also watch:
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com