అధికారిక లాంఛనాలను తిరస్కరించిన కోడెల కుటుంబ సభ్యులు

అధికారిక లాంఛనాలను కోడెల కుటుంబ సభ్యులు తిరస్కరించారు. అవమానాలకు గురిచేసి ఇప్పుడు ప్రభుత్వ లాంఛనాలు అనడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలు, ప్రజలతో కలిసి అంత్యక్రియలు నిర్వహిస్తామని కోడెల కుటుంబ సభ్యులు చెబుతున్నారని టీడీపీ నేత జీవీ ఆంజనేయులు తెలిపారు. కోడెల మృతికి జగన్‌ బాధ్యత వహించాలని ఆయన మరోసారి డిమాండ్‌ చేశారు.

కోడెల శివప్రసాద్ మృతి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని వాదిస్తోంది టీడీపీ. కేసులతో వేధించటం, అవమానించటం వల్లే కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారని అంటున్నారు టీడీపీ నేతలు.

Also watch :

Tags

Next Story