రాజగోపాల్‌కు కేటీఆర్ కౌంటర్

రాజగోపాల్‌కు కేటీఆర్ కౌంటర్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సెషన్‌లో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య మరోసారి ఇంట్రస్టింగ్ వార్ నడిచింది. అధికార పార్టీ ఐదేళ్ల పాలనపై ప్రతిపక్ష కాంగ్రెస్ కడిగిపారేసేందుకు ప్రయత్నించింది. అయితే.. అంతే దీటుగా బదులిచ్చిన మంత్రులు.. ఇక చాలు అనే వరకు తమ అభివృద్ధి పథకాలను వివరించుకుంటూ పోయారు. ఓవరాల్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్సెస్ మంత్రులు అన్నట్లు జరిగిన డైలాగ్ వార్ లో పోటాపోటీగా పంచ్ లు పేలాయి. రాష్ట్రంలో రైతు సంక్షేమం ప్రాజెక్టుల పురోగతిపై కాంగ్రెస్ సభ్యులు సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మంత్రి హరీష్ రావు.. తమ హయాంలో పెండింగ్ ప్రాజెక్టులు రన్నింగ్ ప్రాజెక్టులుగా మారాయన్నారు.

అసెంబ్లీలో పద్దులపై కూడా వాడివేడిగా చర్చ జరిగింది. హైదరాబాద్ అభివృద్ధిపై ప్రభుత్వ హామీలు ఒక్కటీ అమలు కాలేదన్న రాజగోపాల్ రెడ్డి.. పాలన తీరును విమర్శించారు. హైదరాబాద్‌ను డల్లాస్‌ చేస్తామని, మూసినదిని క్లీన్‌ చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రజలకు 70 mm సినిమా చూపించారని ఎద్దేవా చేశారు. ఇలా ఎన్ని రోజులు సినిమా చూడాలన్నారు. దీనికి కౌంటర్ ఇచ్చిన కేటీఆర్.. ఇది కేవలం ట్రైలర్‌ మాత్రమే అని.. సినిమా ముందు ఉందని.. త్వరలోనే ఆ సినిమా చూపిస్తామన్నారు. ఇది సూపర్‌ హిట్‌ అవుతుందన్నారు.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story