'సైరా' డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ అంతా.?

సైరా డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ అంతా.?

మెగాస్టార్ చిరంజీవి హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో ఫుల్ లెంగ్త్ సినిమా ఇప్పటి వరకు చేయలేదు. సైరా నరసింహారెడ్డితో ఆ లోటును భర్తీ చేస్తున్నాడు. బ్రిటీష్ వారిపై తిరుగుబాటు జెండా ఎగరేసిన తొలి భారతీయుడు అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో సైరా మూవీని, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో రామ్ చరణ్ నిర్మించాడు. సైరా మూవీ దసరా కానుకగా అక్టోబర్ 2న రిలీజ్ కాబోతుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ బాషల్లో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. అమితాబ్, నయనతార, సుదీప్, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించడం సైరాకి చాలా ప్లస్ అవుతోంది. వీరి వల్ల ఆయా బాషల్లో సైరాకి మరింత క్రేజ్ పెరిగింది. పోరాట సన్నివేశాలే కాక, ఎమోషన్స్ కూడా అందర్నీ అలరిస్తాయంటోంది సైరా టీమ్.

సైరా మూవీ ట్రైలర్ ని బుధవారం సాయంత్రం రిలీజ్ చేశారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వచ్చే ఆదివారం గ్రాండ్ గా హైదరాబాద్ లో నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరుగుతోంది అంటోంది టీమ్. ఇక డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ తోనూ, సైరాకి పెట్టిన సగం బడ్జెట్ రికవర్ అయ్యిందనే టాక్ వినిపిస్తోంది. డిజిటల్ రైట్స్ లో భాగంగా అమెజాన్ ప్రైమ్ సంస్థ 42 కోట్లకు రైట్స్ ని తీసుకుందని ఆ మధ్యే వార్తలు వచ్చాయి. ఇక తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ శాటిలైట్ రైట్స్ కి 70 కోట్లకు పైగా దక్కాయనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మొత్తంగా డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ కే 100 కోట్లకు పైగా రాబట్టడం మామూలు విషయం కాదు.

Tags

Read MoreRead Less
Next Story