బోటు ప్రమాదంపై విచారణ కమిటీ.. బోటుకు కొక్కాలు తగిలిస్తే తప్ప..

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు గోదావరి బోటు ప్రమాదంపై విచారణకు కమిటీని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయగా.. 9 అంశాలపై విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ధేశించింది. కమిటీ కన్వీనర్‌గా తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ వ్యవహరించనున్నారు. 21 రోజుల్లో ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
మరోవైపు మునిగిన పడవను తీయడం ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదంటున్నారు నిపుణులు. గోదావరిలో కరెంటు ఎక్కువగా ఉండడంతో పాటు... ప్రమాదం జరిగిన ప్రాంతంలో లోతు ఎక్కువగా ఉందని... సహాయక చర్యల్లో తోడ్పాటు అందిస్తున్న ధర్మాడి సత్యం చెబుతున్నారు. బోటు దగ్గరికి చేరి దానికి కొక్కాలు తగిలిస్తే తప్ప... దాన్ని బయటకు తీయడం సాధ్యం కాదన్నారు ఆయన.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com