రెండో టీ-20లో భారత్ ఘన విజయం

సౌతాఫ్రికాతో రెండో టీ-20లో భారత్ ఘన విజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు 20 ఓవర్లలో 5 వికెట్లకు 149 పరుగులు చేశారు. భారత్ 19 ఓవర్లలో 151 పరుగులు చేసింది.
దక్షిణాఫ్రికాను 150 రన్స్‌లోపే పరిమితం చేసిన టీమిండియా.. సునాయాస లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది. రోహిత్ శర్మ త్వరగానే అవుటైనా, కోహ్లీ, శిఖర్ ధవన్ ధాటిగా ఆడడంతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. కోహ్లీ (52 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 72 నాటౌట్), ఓపెనర్ శిఖర్ ధవన్ (31 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 40)తో సత్తా చాటడంతో.. మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
మూడు టీ20ల ఈ సిరీస్‌లో కోహ్లీ సేన 1-0 ఆధిక్యంలో నిలిచింది. ధర్మశాలలో జరగాల్సిన మొదటి మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. చివరి మ్యాచ్ 22న బెంగళూరులో జరగనుంది.
Also watch :
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com