జబర్దస్త్ షో నుంచి ఒకేసారి ముగ్గురు..

బుల్లితెర ప్రేక్షకులకు నవ్వులు పంచే కామెడీ షో జబర్థస్త్ అత్యంత ప్రజాదరణ పొందిన షోగా పాపులారిటీ సంపాదించుకుంది. ఈ షో ద్వారా చాలా మంది యువ కళాకారులకు ఉపాధి దొరకడంతో పాటు సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. వెండి తెరపై హీరోలుగా అదృష్టాన్ని పరీక్షించుకున్నవారూ ఉన్నారు. ఇప్పటికే షకలక శంకర్ హీరోగా నటిస్తుండగా,
ధన్‌రాజ్, చలాకీ చంటీ, రాకెట్ రాఘవ, హైపర్ ఆదిలు సినిమాల్లో తమదైన ముద్ర వేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఈ షో నుంచి హీరోలుగా వస్తున్న వారి సంఖ్య పెరిగింది. ఇందులో సుడిగాలి సుధీర్ ముందు వరుసలో ఉన్నాడు. సాప్ట్‌వేర్ సుధీర్‌గా అభిమానులను అలరించనున్నాడు. మరో కమెడియన్ చమ్మక్ చంద్ర రామ సక్కనోళ్లు సినిమా ద్వారా హీరో అయ్యాడు. రంగస్థలం ఫేమ్ మహేష్ ఆచంట నేను నాగార్జున అని మనముందుకు రాబోతున్నాడు. మరి ప్రేక్షకులు వీరిని హీరోలుగా ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com