పోలీసుల నుంచి తప్పించుకునేందుకు.. రెండో అంతస్తు నుంచి దూకి..

పోలీసుల నుంచి తప్పించుకునేందుకు.. రెండో అంతస్తు నుంచి దూకి..

హైదరాబాద్ మూసాపేట్‌లో దారుణం చోటుచేసుకుంది. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో రెండో అంతస్తు నుంచి దూకారు ఇద్దరు పేకాటరాయుళ్లు. ఈ ఘటనలో జనతానగర్‌ కు చెందిన ప్రవీణ్‌ కుమార్‌ మృతి చెందగా.. మరో వ్యక్తి కాంతారావుకు తీవ్రగాయాలయ్యాయి.

మూసాపేటలోని ఓ భవనంలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. బుధవారం సాయంత్రం ఎస్‌వోటీ, కూకట్‌పల్లి పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. పేకాడుతున్న ఐదుగురు వ్యక్తుల్లో ముగ్గురిని పట్టుకోగా.. ప్రవీణ్‌కుమార్‌, కాంతారావు తప్పించుకునే క్రమంలో రెండో అంతస్తు పైనుంచి కిందకు దూకారు. ఈ ఘటనలో ప్రవీణ్‌కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందగా కాంతారావుకు తీవ్ర గాయలయ్యాయి.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story