వారిని దూరదర్శన్‌ కలిపింది

వారిని దూరదర్శన్‌ కలిపింది
X

కొన్ని సంఘటనలు యాధృచ్ఛికమే అయినా.. సినిమాల్లో చూపించే సన్నివేశాల్లా అవి నిజ జీవితంలోనూ జరుగుతాయి. అచ్చం అలాంటి ఘటనే కోల్‌కతాలో జరిగింది. తప్పిపోయిన బాలుడ్ని దూరదర్శన్‌లో ప్రసారమైన ఓ కార్యక్రమం తల్లిదండ్రుల చెంతకు చేర్చింది. రెండున్నర ఏళ్ళ క్రితం మానసిక దివ్యాంగుడైన 13 ఏళ్ల బాలుడు తప్పిపోయాడు. అతని కోసం తల్లిదండ్రులు ఎంతగా వెతికినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే తాజాగా ‘దూరదర్శన్‌ కోల్‌కత’ ఛానెల్‌లో మానసిక వికలాంగులైన అనాథ బాలలకు ఆశ్రయం కల్పించే గృహంపై ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. పశ్చిమ బంగాల్‌లోని నదియా జిల్లా నకషిపారా ప్రాంతంలో మానసిక దివ్యాంగులైన అనాథ బాలలను ఆదరించే గృహం ఉంది.

ఆ అనాథాశ్రమాన్ని ఓ ప్రభుత్వోద్యోగి మోస్లెమ్‌ మున్షీ అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. ఆశ్రమం గురించి ఓ కార్యక్రమాన్ని రూపొందించి ప్రసారం చేసింది దూరదర్శన్‌. ఆ ప్రోగ్రాం చూస్తున్న బాలుడి తల్లిదండ్రులకు అందులో అతను కనిపించాడు. మానసిక వికలాంగులైన అనాథ బాలల ఆశ్రమంలో తమ కుమారుడు ఉన్నాడని తెలుసుకున్నారు. వెంటనే బాలుడి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. అనంతరం పోలీసులు దూరదర్శన్ కార్యాలయాన్ని సంప్రదించి బాలుడి ఆచూకి కనుగొన్నారు. వసతి గృహం ఉన్న చోటుకు వెళ్ళి బాలుడ్ని తల్లిదండ్రులకు అప్పగించారు.

Tags

Next Story