నయన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

నయన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
X

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ నయనతారకు ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు. ఆమె వారి సినిమాల్లో నటించేందుకు ఎంత పారితోషికం డిమాండ్ చేసినా నిర్మాతలు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. లేడీ సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న నయన్‌ దక్షిణాదిలో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న కథానాయికగా మారినట్లు ఫిలిం వర్గాలు చెబుతున్నాయి. ఆమె కెరీర్ మెుదటిలో లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన ‘పయ్యా’ చిత్రంలో నటించేందుకు ఏకంగా రూ.కోటి పారితోషికం అడిగింది. దీంతో ఒక్కసారిగా దక్షిణాది చిత్ర పరిశ్రమ నయన్ వైపు తిరిగి చూసింది. అలా ఆమె తొమ్మిదేళ్ల సినిమా కెరీర్‌లో పారితోషికం విలువ రూ.6 కోట్లకు పెరిగిందని తమిళ సినీ వర్గాల నుంచి వినిపిస్తోంది. నయనతార ఎక్కువ సినిమాలు తమిళంలోనే చేసింది. చాలా మంది హీరోయిన్లు అలా వచ్చి ఇలా వెళ్ళినా.. నయన్ కెరీర్ గ్రాఫ్‌ ఎప్పుడూ పడిపోలేదు.

తాజాగా రజనీకాంత్‌తో నటిస్తున్న సినిమాలో నయన్ రూ.6 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం నయన్ తన బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్‌ శివన్‌ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘నెట్రిక్కన్‌’ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి కూడా 6 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఆమె కంటిచూపు సమస్య ఉన్న యువతి పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది.

Tags

Next Story