ఐటీ ఉద్యోగులకు దీపావళి కానుక..

ఐటీ ఉద్యోగులకు దీపావళి కానుక..

ఉదయం లేస్తే ఉరుకులు పరుగులు తీసే నగర జీవికి మెట్రో వచ్చాక ప్రయాణం సులువైంది. ఐటీ ఉద్యోగులకైతే చెప్పే పనిలేదు. దాదాపుగా చాలా మంది సాప్ట్‌వేర్ ఉద్యోగులు మెట్రోలోనే ప్రయాణిస్తుంటారు. మరి వీరి కోసం రాయదుర్గం మెట్రో పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. అక్టోబర్ 15 తేదీ వరకు మిగిలిన పనులు పూర్తి చేసి నెలాఖరు కల్లా ప్రయాణీకులకు అందుబాటులోకి తెస్తామని మెట్రో అధికారులు వెల్లడిస్తున్నారు. దీపావళి నాటికి రాయదుర్గం మెట్రో పరుగులు తీస్తుందని అంటున్నారు. ప్రస్తుతం హైటెక్ సిటీ వరకు ఉన్న మెట్రో రైలు.. కిలో మీటర్ దూరంలో ఉన్న మైండ్ స్పేస్ వద్ద రాయదుర్గం మెట్రో స్టేషన్ నిర్మిస్తున్నారు. అక్టోబరు నెలాఖరు లోపు రాయదుర్గం స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని టార్గెట్ పెట్టుకుంది ఎల్ అండ్ టీ. మైండ్ స్పేస్ వరకు మెట్రో ప్రారంభమైతే ఐటీ ఎంప్లాయీస్‌కి ఫుల్ ఖుషీ.

Tags

Read MoreRead Less
Next Story