శనివారంలోగా TTD బోర్డు రద్దు చేయాలి.. లేదంటే ఆందోళనే : బీజేపీ నేత

X
హిందువులు, వారి మనోభావాలపై ఏమాత్రం జగన్‌కు గౌరవం ఉన్నా వెంటనే TTD బోర్డును రద్దు చేయాలన్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్‌రెడ్డి. TTD బోర్డు రద్దుపై శనివారం(21/09/2019) ఉదయంలోగా నిర్ణయం తీసుకోకపోతే.. TTD ఏడీ బిల్డింగ్ వద్ద ఆందోళన చేపడతామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాలా.. లేక జగన్‌మోహన్‌రెడ్డి దేవస్థానాలా అని ప్రశ్నించారు. మీ సొంత గుడిలో అయితే 36 మందితో కాదు.. 360 మందితో బోర్డు వేసుకోండని ఎద్దేవా చేశారు. రైలు ఇంజిన్‌కు బోగీలు వేసినట్లు TTD బోర్డు సభ్యుల్ని పెంచుకుంటూ పోవడం మంచిది కాదన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
