పవన్ కళ్యాణ్‌తో సెల్ఫీ దిగాల్సిన అవసరం నాకు లేదు : సంపత్ కుమార్

తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గవిభేదాలు రోజురోజుకీ ముదురుతున్నాయి. హుజూర్‌నగర్ ఉపఎన్నిక రేపిన చిచ్చు చల్లారకముందే...యూరేనియం మంటలు రాజుకున్నాయి. ఎంపీ రేవంత్‌రెడ్డి తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్. తనకు అన్న లాంటి రేవంత్ చేసిన వ్యాఖ్యలు బాధించాయన్నారు. యురేనియంపై సంపత్‌కు ఏబీసీడీలు కూడా తెలియవనడం సరికాదన్నారు... ఇదే ఇష్యూపై గతంలో ఢిల్లీలో ఫారెస్ట్ డీజీని కలిసి ఫిర్యాదు చేసిన అంశాన్ని గుర్తుచేశారు. ఏబీసీడీ తెలియకుండానే ఢిల్లీ వరకు వెళ్లానా అంటూ ప్రశ్నించారు...
యురేనియంపై జరిగిన రౌండ్ టేబుల్ సమవేశానికి రేవంత్‌రెడ్డిని పిలువనేలేదని.. కానీ ఆయనే నాదెండ్ల మనోహర్‌కు ఫోన్ చేసి...అడిగి పిలుపించుకున్నారని సంపత్ ఆరోపించారు. పవన్ కళ్యాణ్‌తో సెల్ఫీ దిగాల్సిన అవసరం తనకు లేదని.. తన సెల్పీ కోసమే చాలా మంది వేచిచూస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి..పవన్‌కు రిపోర్టు ఇవ్వడం ఏంటని అడగటంలో తప్పేముందన్నారు.. సినిమాలో హీరో, విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్ని తానే అని రేవంత్ ఫీలువుతున్నాడని.. కానీ కాంగ్రెస్‌లో అది సాధ్యం కాదన్నారు సంపత్..హుజూర్‌నగర్ ఉపఎన్నికపైనా సంపత్ స్పందించారు. పార్టీ అభ్యర్థి పద్మావతేనని ఆమెనే గెలుపిస్తామని స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com