బావిలో పడిన వ్యక్తి కోసం పోలీసులు..

బావిలో  పడిన వ్యక్తి కోసం పోలీసులు..

హైదరాబాద్ శివారులోని శంషాబాద్‌లో పోలీసులు అత్యంత ధైర్యసాహసాలతో 300 అడుగుల లోతున్న బావిలో పడిన ఓ వ్యక్తిని కాపాడారు. తీవ్రంగా గాయాల పాలైన అతన్ని హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించి ప్రాణాలు నిలబెట్టారు. ఈ ఘటన శంషాబాద్ మండలంలోని పెద్దషాపూర్‌లో జరిగింది.

దాసరి చంద్రయ్య అనే వ్యక్తి గురువారం సాయంత్రం పావురాల కోసమని వెళ్ళాడు. ఊరి చివరన పాడుబడిన బావి దగ్గర వాటిని పట్టుకునే ప్రయత్నంలో కాలు జారి పడిపోయాడు. కాసేపటికి అటువైపు వెళ్తున్న పశువుల కాపర్లు.. అరుపులు కేకలు విని బావిలోకి తొంగి చూసారు. మనిషి పడినట్టు గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు. అక్కడి నుంచి కంట్రోల్ రూమ్ టీమ్‌.. శంషాబాద్ రూరల్ పోలీసులను అప్రమత్తం చేయడంతో రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. 300 అడుగుల లోతులో పడిపోయిన వ్యక్తిని బయటకు తీయడానికి ప్రాణాలకు తెగించారు. అప్పటికే చీకటి పడి పోవడం.. భారీ క్రేన్ ఏదీ అందుబాటులో లేక పోవడంతో పోలీసులే నడుముకు తాడు కట్టుకుని అతి కష్టంమీద బావిలోకి దిగారు. చివరకు 5 గంటల పాటు శ్రమించి చంద్రయ్యను బయటకు తీశారు. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో అతను కోలుకుంటున్నాడు. ఇంత రిస్క్ చేసి ఓ ప్రాణం నిలబెట్టిన పోలీసుల్ని అంతా అభినందిస్తున్నారు.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story