కోల్ ఇండియాలో కొలువుల జాతర.. 9000 పోస్టులు..

కోల్ ఇండియాలో కొలువుల జాతర.. 9000 పోస్టులు..

కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) కొలువుల జాతరను ప్రకటించింది. త్వరలోనే కోల్ ఇండియా 9000 ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేయనుందని సమాచారం. కోల్ ఇండియా పరిధిలోని 8 సబ్సిడరీ కంపెనీలలో ఈ నియామకాలు చేపట్టనున్నట్లు ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ తెలిపింది. ఎగ్జిక్యూటివ్ పోస్టులను సంస్థ భర్తీ చేయనుండగా.. కార్మికులు, టెక్నికల్ ఉద్యోగాల భర్తీని సబ్సిడరీ కంపెనీలు చేపడతాయి. ఈ డైవ్ ద్వారా చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఖాళీల భర్తీ కోసం కోల్ ఇండియా ఎక్కువ సంఖ్యలో ఎగ్జిక్యూటివ్‌లను నియమించనుంది.

4000 ఖాళీలు ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులలో 900 పోస్టులను ప్రకటనలు, ఇంటర్వ్యూ ద్వారా, 2200 పోస్టులను పోటీ పరీక్షల ద్వారా, 400 పోస్టులను క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా, మిగతా పోస్టులను వేర్వేరు విధానాల్లో భర్తీ చేయనున్నారు. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో ప్రధానంగా కార్మికులు, టెక్నికల్ పోస్టులు కలిపి మొత్తం 5000 ఖాళీలను సంస్థ నిబంధనల ప్రకారం భర్తీ చేయనున్నారు. వీటిలో 2300 పోస్టులను కోల్ ఇండియా ప్రాజెక్టుల కారణంగా భూమిని కోల్పోయిన నిర్వాసిత కుటుంబాల్లోని వ్యక్తులతో భర్తీ చేయనుంది. ఇక 2350 పోస్టులకు కారుణ్య నియామకాలు చేపట్టనున్నారు. భారత్‌లో రైల్వేల తరువాత అధిక సంఖ్యలో ఉద్యోగులు ఉన్న పబ్లిక్ సెక్టార్ సంస్థగా కోల్ ఇండియా నిలిచిందని ఎకనామిక్ టైమ్స్ వివరించింది.

Tags

Read MoreRead Less
Next Story