భార్య గర్భం దాల్చలేదని పక్కింటి కుర్రాడిపై కేసు పెట్టిన భర్త

భార్య గర్భం దాల్చలేదని పక్కింటి కుర్రాడిపై కేసు పెట్టిన భర్త

తన భార్యకు గర్భం రాలేదని పక్కింటి కుర్రాడుపై కేసు పెట్టాడు భర్త. తన భార్యను గర్భవతిని చేయడంలో పక్కింటి కుర్రాడు పూర్తిగా విఫలమయ్యాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు భర్త. జర్మనీలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.

ముచ్చటైన జంట.. ఆన్యోనంగా సాగుతున్న వారి జీవితంలో ఏదో తెలియని లోటు. ఆ లోటు తీర్చాలంటే పిల్లలు ఉండాలని భావించింది జంట. పిల్లలు ఉంటే ఇల్లంతా సందడిగా ఉంటుంది అని అనుకున్నారు. కానీ ఎంత ప్రయత్నించినా వారికి పిల్లలు పుట్టకపోవడంతో.. డాక్టర్‌ని సంప్రదించారు. తన వల్ల భార్యకు పిల్లలు పుట్టరని తెలుసుకున్న భర్త.. ఎవరూ చేయని సాహసం చేశాడు. ఎలాగైనా తన భార్యను తల్లిని చేయాలని.. పక్కింట్లో ఉండే ఓ కుర్రాడి సహాయాన్ని కోరాడు. ఇందుకు అతడికి 2,500 డాలర్లు చెల్లించాడు. అయితే ఆరు నెలల్లో తన భార్యను గర్భవతిని చేయాలని అతడికి షరతు విధించాడు. అందుకు అతడు కూడా సరేనని ఒప్పుకున్నాడు.

అయితే ఆ వ్యక్తి ఆరునెలల్లో 72 సార్లు ప్రయత్నించినా ఆమె గర్భవతి కాలేదు. దీంతో అనుమానం వచ్చి డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. పరీక్షించిన వైద్యులు అతనికి కూడా సంతానయోగం లేదని తేల్చి చెప్పేశారు. ఈ విషయం భర్తకు తెలిసి షాక్ అయ్యాడు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. తన భార్యను గర్భవతిని చేయడంలో పక్కింటి కుర్రాడు విఫలమయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు భర్త.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story