నిజామాబాద్‌లో దారుణం.. యువతిపై సామూహిక అత్యాచారం

నిజామాబాద్‌లో దారుణం.. యువతిపై సామూహిక అత్యాచారం

నిజామాబాద్‌లో దారుణం జరిగింది. ఓ యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. ప్రేమ పేరుతో వలవేసి ఓ యువతిపై అత్యాచారం చేశాడు ప్రియుడు. ఆ తర్వాత తన ఆరుగురు స్నేహితులను పిలిచి అత్యాచారం చేయించాడు. ఎవరికీ చెప్పకుండా ఉండడానికి ఆ దారుణాన్ని వీడియో తీశాడు.

బాధితురాలిది నిజామాబాద్‌ నగర శివార్లలోని పల్లెటూరు. నిరుపేద కుటుంబం కావడంతో ఊరికి దూరంగా ఉన్న ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. రాకపోకలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆటోలోనే పనికి వెళ్లేది. ఈ క్రమంలోనే ఆటో నడిపే సురేశ్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తనకు పెళ్లయిన విషయాన్ని యువతితో చెప్పకుండా ప్రేమ నటించాడు సురేశ్‌. సారంగాపూర్‌ హనుమాన్‌ ఆలయానికి వెళ్దామని చెప్పి శుక్రవారం మధ్యాహ్నం ఆటోలో ఎక్కించుకున్నాడు. సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఉన్న జిల్లా జైలు వెనకకు తీసుకు వెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా తన స్నేహితుల్ని కూడా పిలిచి అఘాయిత్యం చేయించాడు.

అత్యాచారం చేసిన ఇద్దరు స్నేహితులు జైలు పరిసర ప్రాంతాల్లో ఆటో నిలిపి వీడియో చూస్తుండగా పోలీసులు గమనించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. యువతిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలినవారు పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story