టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం

పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్‌రెడ్డికి పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఎమ్మెల్యే తల, కాలుకు బలమైన గాయాలయ్యాయి. హైదరాబాద్‌ నుంచి వెళ్తుండగా చేవెళ్ల దగ్గర ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి అదుపు తప్పి కరెంటు స్తంభానికి ఎమ్మెల్యే కారు ఢీకొన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్యేతోపాటు గన్‌మన్‌ కారులోనే ఉన్నారు. ఎమ్మెల్యేకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story