ఎవ్వరూ ఊహించని విధంగా సైరా నరసింహారెడ్డి..

ఎవ్వరూ ఊహించని విధంగా సైరా నరసింహారెడ్డి..

మెగాస్టార్ చిరంజీవి రికార్డుల వేట మొదలైంది. ఇటీవల రిలీజైన సైరా థియేట్రికల్ ట్రైలర్ కి సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మూడు నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్ ను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ బాషల్లో రిలీజ్ చేశారు. యూట్యూబ్ తో పాటు మిగతా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ మీద సైరా ట్రైలర్ కి మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. కేవలం 24 గంటల్లో సైరా ట్రైలర్ కి అన్ని బాషల్లో కలిపి 34 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

చిరంజీవి కెరీర్లో ఇదొక రికార్డ్. టాప్ లిస్ట్ లోనూ తెలుగులో మొదటి మూడు స్థానాల్లో ఉంటుంది ఈ రికార్డ్. దీని బట్టే సైరా కోసం ఆడియన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారనేది అర్ధం చేసుకోవచ్చు. తెలుగు వెర్షన్ ట్రైలర్ కి వచ్చినంతగా, హిందీ ట్రైలర్ కి కూడా దాదాపు అంతే రెస్పాన్స్ రావడం హైలైట్ గా చెప్పాలి. ఇక తమిళ, కన్నడ వెర్షన్ల ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మలయాళంలో మాత్రం ఫరవాలేదనిపిస్తోంది. తెలుగు వెర్షన్ ట్రైలర్ 10 మిలియన్ల వ్యూస్ కి దగ్గరవుతుంటే, తమిళ్, కన్నడ వెర్షన్లు 2 మిలియన్ల వ్యూస్ కి దగ్గరవుతున్నాయి.

అందరికి షాక్ ఇచ్చే అంశం ఏంటంటే, సైరా ట్రైలర్ కి హిందీలో ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. సైరా టీమ్ లో అమితాబ్ మినహా, మిగతా వాళ్ళకు అక్కడ స్టార్ డమ్ లేదు. కాకపోతే కాస్త గుర్తింపు అయితే ఉంది. అయినప్పటికీ హిందీ వెర్షన్ ట్రైలర్ ఆల్ రెడీ 10 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసేసింది. దీన్ని బట్టీ చూస్తే, సైరాకి హిందీ వెర్షన్ లో మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ట్రైలర్ వచ్చాక సైరాపై అన్ని లాంగ్వేజెస్ లోనూ అంచనాలు పెరిగాయి. ట్రైలర్ లో చూపించినట్లుగా యాక్షన్, ఎమోషన్స్, ప్రొడక్షన్ వాల్యూస్, బ్యాగ్రౌండ్ స్కోర్, టేకింగ్, డైలాగ్స్, పెర్ఫార్మెన్స్ సినిమాలో కూడా ఉంటే, సైరా సూపర్ సక్సెస్ అవ్వడం ఖాయం అనే చెప్పాలి. ఇక ఈ నెల 22న సైరా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగబోతుంది. మరి ఈ దసరాకి వస్తున్న సైరా, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story