డ్యాన్స్‌లతో అదరగొట్టిన ఎంపీలు

డ్యాన్స్‌లతో అదరగొట్టిన ఎంపీలు

తృణముల్ కాంగ్రెస్ నుంచి ఎంపీలుగా గెలుపొందిన సినీ నటులు నుస్రత్ జహాన్, మిమి చక్రవర్తులు డ్యాన్స్‌లతో సందడి చేశారు. దుర్గా మాత ఉత్సవాలకు సంబంధించి ఒక పాటలో వారు నటించారు. బెంగాలీలో తెరకెక్కిన ‘ఆశే మా దుర్గాశే’ పాటకు ఈ ఇద్దరు ఎంపీలు శాస్త్రీయ నృత్యం చేశారు. ఈ పాటలో ప్రముఖ బెంగాలీ నటి సుభశ్రీ గంగూలి కూడా డ్యాన్స్ చేశారు.

ఈ నెల 29 నుంచి దేవి శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో చాలా వైభవంగా వీటిని నిర్వహిస్తారు. దుర్గామాత పూజా సాంగ్-2019 పేరుతో రూపొందించిన పాటలో ఎంపీలు నుస్రత్ జహాన్, మిమి చక్రవర్తులు డ్యాన్స్‌లతో అదరగొట్టారు.

https://www.facebook.com/nusratchirps/videos/516982205788276/

Tags

Read MoreRead Less
Next Story