డ్యాన్స్‌తో దుమ్మురేపిన మహిళా ఎంపీలు..

డ్యాన్స్‌తో దుమ్మురేపిన మహిళా ఎంపీలు..

పశ్చిమ బెంగాల్ కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన మిమి చక్రవర్తి, నుస్రత్ జహాన్‌లు డ్యాన్స్‌ ఇరగదీశారు. వారి స్టెప్పులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దేశవ్యాప్తంగా వచ్చే నెలలో దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.. పశ్చిమ బెంగాల్ లో అక్టోబర్ 4 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించనున్న దసరా వేడుకల నేపథ్యంలో ప్రముఖ బెంగాలీ సినీ నటులు, ఎంపీలు నుస్రత్ జహాన్, మిమీ చక్రవర్తితో ప్రత్యేక పాటను రూపొందించారు. బెంగాలీ భాషలో దుర్గామాత మీద రూపొందించిన 'ఆశే మా దుర్గా శే' పాటకు ఎంపీలు నుస్రత్ జహాన్, మిమీ చకవ్రర్తి డాన్స్ చేశారు. నటి సుభశ్రీ గంగూలీ కూడా ఈ వీడియోలో కనిపించడం విశేషం. సోమవారం కెప్టెన్ టీఎంటీ ఈ పాటను సామాజిక మాధ్యమాల్లో షేర్ చెయ్యగా వైరల్ గా మారింది. ఇప్పటికే 1.6 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

Tags

Read MoreRead Less
Next Story