అక్రమ కట్టడాల కూల్చివేత.. అధికారులను అడ్డుకున్న టీడీపీ నేత బడేటి బుజ్జి

అక్రమ కట్టడాల కూల్చివేత.. అధికారులను అడ్డుకున్న టీడీపీ నేత బడేటి బుజ్జి

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అక్రమ కట్టడాల కూల్చివేత ఉద్రిక్తంగా మారింది. సుబ్బమ్మ దేవి హైస్కూల్‌ ఆటస్థలంలో నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్లు అక్రమమంటూ కూల్చేయడానికి వెళ్లారు మున్సిపల్‌ అధికారులు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి, స్థానికులు మున్సిపల్‌ అధికారులను అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది.

పరిస్థితి అదుపు తప్పేలా ఉండటంతో భారీగా పోలీసులను మోహరించారు అధికారులు. చివరికి మూడు రోజుల్లో స్థలం ఖాళీ చేయాలని నోటీసులిచ్చి అధికారులు వెనుదిరిగారు. అపార్ట్‌మెంట్లకు అనుమతులిచ్చిన అధికారులే ఇప్పుడు అక్రమం అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బడేటి బుజ్జి.

Tags

Read MoreRead Less
Next Story