క్యూట్‌ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో టాలీవుడ్ హీరో కూతురు.. వీడియో వైరల్

క్యూట్‌ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో  టాలీవుడ్ హీరో కూతురు.. వీడియో వైరల్

మహేష్ బాబు మరియు అల్లు అర్జున్.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తమకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఫ్యాన్స్ కోసం షేర్ చేస్తుంటారు. ముఖ్యంగా తమ పిల్లలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానుల కోసం షేర్‌ చేస్తుంటారు ఈ హీరోలు. అయితే ఆదివారం ‘డాటర్స్‌ డే’ సందర్భంగా ఓ క్యూట్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు బన్నీ. అల వైకుంఠపురము మూవీ టీజర్‌లో మురళీ శర్మ, అల్లు అర్జున్‌లు చెప్పిన డైలాగ్‌‌ తెగ పాపులర్ అయింది. ఇప్పుడు ఆ డైలాగ్‌నే బన్నీ.. తన కూతురు అర్హాతో కలిసి చెప్పాడు. ఈ వీడియో లో.. ఏంట్రోయ్ గ్యాప్ ఇచ్చావ్ అంటూ బన్నీ సీరియస్ గా అంటూంటే.. ఇవ్వలే వచ్చింది.. అంటూ క్యూట్ గా చెప్పేసింది అర్హా. బన్నీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో పోస్ట్ చేయడంతో.. వైరల్ గా మారింది. క్యూట్‌ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ తో అర్హ చెప్పిన డైలాగ్స్‌కు మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

మహేష్‌ బాబు కూడా డాటర్స్‌ డే సందర్భంగా తన ట్విట్టర్‌లో ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. కూతురితో కలిసి తాను దిగిన ఫోటోలను వీడియో రూపంలో పోస్ట్ చేశాడు మహేష్. ‘నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నువ్వు ఎప్పుడూ ఇలా మెరిసిపోతూ ఉండాలి’ అంటూ మహేష్ ట్వీట్ చేశాడు. ఈ వీడియోని మహేష్ ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story