బోటు ప్రమాదంలో మరో మహిళ మృతదేహం లభ్యం

గోదారి తీరంలో విషాద ఘోష ఇంకా మార్మోగుతూనే ఉంది. గత ఆదివారం మధ్యాహ్నం సమయంలో 77 మందితో వెళ్తున్న పడవ మునిగిపోయినా.. ఇంకా మృతదేహాల వెలికితీత పూర్తికాలేదు. ఆదివారం ఉదయం దేవీపట్నం మండలం మూలపాడు వద్ద ఓ మహిళ మృతదేహం దొరికింది. పూర్తిగా పాడైన స్థితికి చేరుకోవడంతో వెంటనే రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పోస్ట్‌మార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేశారు. తాజాగా దొరికిన మహిళ డెడ్‌బాడీతో కలిపి ఇప్పటికి 37 మందిని వెలికితీశారు. ఇంకా 14 మంది జాడ తెలియడం లేదు.
అటు, కచ్చులూరు వద్ద గాలింపు నిలిపేయడంతో పడవలన్నీ ఒడ్డుకు చేరాయి. మునిగిన బోటు పైకి తీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి భిన్నంగా ఉంది.ముంబై నిపుణుల కమిటీ నివేదిక వచ్చాక కానీ బోటును పైకి తీసేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో.. బాధిత కుటుంబాల్లో అంతులేని ఆవేదన కనిపిస్తోంది. కచ్చులూరు మందం వద్దకు తమను వెళ్లనివ్వడం లేదని, కడసారి చూపులకైనా తాము నోచుకోలేకపోతున్నామని కన్నీరు పెడుతున్నారు.
గాలింపు చర్యల కోసం ఓ దశలో 720 మందిని రంగంలోకి దించినా NDRF, SDRF, ఫైర్ సిబ్బంది బయటకు వచ్చేసారు. పోలీసులు, ఆరోగ్య, రెవెన్యూ డిపార్ట్‌మెంట్ టీమ్‌లు స్థానిక మత్స్యకారులు మాత్రమే.. కచ్చులూరులో ఉన్నారు. అటు, తాజా పరిస్థితిపై తూర్పు గోదావరి కలెక్టర్ మురళీధర్‌రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. రాజకీయంగానూ ప్రమాద ఘటన దుమారం రేపిన నేపథ్యంలో.. ఎక్కడా వివాదాలకు తావు లేకుండా చూడాలని స్థానిక అధికారులను ఆదేశించారు.
Also watch :
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com