కాంగ్రెస్, బీజేపీ ఆరోపణలకు సీఎం కేసీఆర్ కౌంటర్

పార్టీ ఫిరాయింపులపై బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్నఆరోపణలకు అసెంబ్లీలో సమాధానం ఇచ్చారు సీఎం కేసీఆర్. టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరలేదని.. రాజ్యాంగ బద్ధంగా టీఆర్‌ఎస్‌లో విలీనం అయ్యారని గుర్తు చేశారు. రాజస్థాన్, గోవాలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీజేపీ చేర్చుకుందని.. అది అనైతికమని విపక్షాలకు అనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రానికో రాజ్యాంగం ఉంటుందా అని నిలదీశారు సీఎం కేసీఆర్.
మధ్యలో జోక్యం చేసుకున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల విలీనం చట్ట విరుద్ధమని ఆయన ఆరోపించారు. భట్టి విక్రమార్క వ్యాఖ్యలకు మళ్లీ కౌంటర్ ఇచ్చారు సీఎం కేసీఆర్. విలీనంపై కాంగ్రెస్ ఇచ్చిన పిటిషన్ గాలి పిటిషన్ కాబట్టే.. ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఉద్యమసమయంలో టీఆర్‌ఎస్‌ను చీల్చిన కాంగ్రెస్‌కు.. ఫిరాయింపులపై మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు.
Also watch :
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com