ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం

ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం

తెంలగాణ బడ్జెట్‌ సమావేశాలు నేటితో ముగియనున్నాయి.. ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీతోపాటు శాసనమండలి ఆమోదం తెలుపనుంది.. ఉదయం సభ ప్రారంభం కాగానే ద్రవ్య వినిమయ బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రవేశపెడతారు. చర్చ అనంతరం బిల్లుకు సభ ఆమోదం తెలుపనుంది.. అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత శాసనమండలిలో బిల్లును ప్రవేశపెడతారు.. అక్కడా చర్చ జరిపి ఆమోదం తెలుపుతారు.. అలాగే ఇప్పటికే అసెంబ్లీ ఆమోదం పొందిన మున్సిపల్‌, సివిల్‌ కోడ్‌ బిల్లులకూ శాసనమండలి నేడు ఆమోదం తెలుపనుంది.

ఈనెల 9న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మొదలయ్యాయి.. సెలవులు మినహాయిస్తే నేటితో కలిపి 10 రోజులపాటు సమావేశాలు జరిగినట్టవుతుంది.. ఈనెల 9న అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టగా.. శాసనమండలిలో ఆర్థిక మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత పద్దులపై వివరంగా చర్చ జరిగింది. ప్రభుత్వ శాఖలకు సంబంధించి పలు పద్దులకు సభ ఆమోదం తెలిపింది.. శనివారం పలు పద్దులపై చర్చ జరిగింది.. గవర్నర్‌, మంత్రి మండలి, సాధారణ పరిపాలన శాఖ, ఎన్నికల పద్దులపై చర్చించారు. సమాచార, పౌర సంబంధాలు, శాసన వ్యవస్థ, న్యాయ పాలన, ఆర్థిక, నిర్వహణ, ప్రణాళిక, సర్వే, గణాంకాల శాఖల పద్దులపై సుదీర్ఘంగా చర్చించారు.

Tags

Next Story