టిక్‌టాక్ పిచ్చికి మరో యువకుడు బలి

టిక్‌టాక్ పిచ్చికి  మరో యువకుడు బలి
X

టిక్‌టాక్ పిచ్చి ఓ యువకుడి ప్రాణం తీసింది. టిక్‌టాక్ కోసం ఓ వాగు వద్ద మొబైల్‌లో వీడియోలు తీస్తుండగా.. ప్రమాదవశాత్తూ అతను నీళ్లలో కొట్టుకుపోయి చనిపోయాడు. ఈ విషాదకరమైన ఘటన నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం గొనుగొప్పులలో జరిగింది. రెండ్రోజుల గాలింపు తర్వాత ఇవాళ మృతదేహాన్ని బయటకు తీశారు.

గోనుగొప్పుల గ్రామానికి చెందిన దినేష్, మనోజ్, గంగాచలం ముగ్గురూ కలిసి సమీపంలోని కప్పలవాగు అలుగు వద్దకు వెళ్లారు. అక్కడ కొన్ని సినిమా పాటలకు సరదాగా టిక్‌టాక్ వీడియోలు చేస్తున్నారు. ఇంతలో కాలు పట్టుతప్పి దినేష్ కొట్టుకుపోయాడు.

Also watch :

Tags

Next Story