ఉల్లి తినని వ్యక్తిని పెళ్లి చేసుకుంటా.. : హీరోయిన్ పెళ్లి ప్రపోజల్

ఉల్లి తినని వ్యక్తిని పెళ్లి చేసుకుంటా.. : హీరోయిన్ పెళ్లి ప్రపోజల్

నేను పెళ్లి చేసుకోబోయే వరుడు ఎలా ఉండాలనే దానిపై పెద్దగా కోరికలు ఏం లేవు.. కాకపోతే ఉల్లి పాయ తినకూడదు.. ప్రతి రోజు క్లీన్ షేవ్‌తో కనిపించాలి.. మూడు పూటలా అతడే వంట చేయాలి.. మద్యం, మాంసం ముట్టుకోకూడదు.. కేవలం సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలి.. భారత్‌లోని అన్ని భాషా చిత్రాలపై అతడికి గౌరవం ఉండాలి. వాటిని చూసి ఎంజాయ్ చేయాలి. కలర్, కులం వీటి గురించి నేనసలు పట్టించుకోను. అలాంటి పట్టింపులు ఏవీ లేవు నాకు అంటూ హార్ట్ ఎటాక్ బ్యూటీ ఆదా శర్మ.. వరుడు కావలెను అని ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. పెళ్లి కుమార్తె గెటప్‌లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఇక అది చూసిన నెటిజన్లు క్యూ కట్టేస్తున్నారు. మేం రెడీ అంటూ కొందరు.. మీరు చెప్పిన ప్రపోజల్స్‌కి ఓకే అంటూ.. బ్యాడ్ హాబిట్స్ అన్నీ ఈ బ్యూటీ కోసం వదిలేసుకుంటామని మరి కొందరు.. ఆదాను అర్ధాంగి చేసుకోవడానికి సిద్దపడుతున్నారు. మరి ఆదా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటుందో చూడాలి. ప్రస్తుతం ఆదా హిందీలో కమాండో 3, బైపాస్ రోడ్ చిత్రాల్లో నటిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story