మౌనిక కుటుంబ సభ్యులకు పరిహారంతో పాటు..

మౌనిక కుటుంబ సభ్యులకు పరిహారంతో పాటు..

అమీర్‌పేట మెట్రోస్టేషన్‌లో పెచ్చులూడి పడటంతో మౌనిక మరణించింది. మౌనిక కుటుంబ సభ్యులతో అండ్‌ టీ అధికారులు చర్చించారు. రూ. 50లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. ఇన్సూరెన్స్ డబ్బు మాత్రమే ఇస్తామని అధికారులు చెప్పారు. అయితే ఈ ప్రమాదానికి ఇన్సూరెన్స్ వర్తిస్తుందా? లేదా? అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు. ఎక్స్‌గ్రేషియా కాకుండా.. ఇన్సూరెన్స్ విషయం చర్చించడంపై మౌనిక కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మౌనిక కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చర్చల తర్వాత మౌనిక కుటుంబ సభ్యులకు రూ. 20 లక్షల పరిహారం.. ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు ఎల్‌ అండ్ టీ అధికారులు.

మౌనిక మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తన భార్య చనిపోయిందంటూ భర్త హరికాంత్‌రెడ్డి కన్నీరుమున్నీరయ్యారు. ఆస్పత్రికి వచ్చిన టీజేఏసీ ప్రెసిడెంట్ కోదండరాం.. మౌనిక కుటుంబ సభ్యులను ఓదార్చారు. మెట్రో అధికారుల తీరుని ఆయన తప్పుపట్టారు.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story